58 ఏళ్ల మైక్ టైసన్ దాదాపు 19 ఏళ్ల తర్వాత ఓ ఫైట్‌లో పోటీపడ్డారు. 27 ఏళ్ల జేక్ పాల్ ప్రత్యర్థి. ఈ ఫైట్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఆ మ్యాచ్‌ను చూసేందుకు ఒకేసారి 120 మిలియన్ల మంది యాప్‌లోకి వచ్చేశారు. దీంతో లోడ్ తట్టుకోలేక నెట్‌ఫ్లిక్స్ స్తంభించింది. దీనిపై యాజమాన్యానికి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.