జాబ్ క్యాలెండర్ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును శాసనసభలో ఆయన ప్రవేశపెట్టారు. అనంతరం ప్రసంగిస్తూ.. . పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు గ్రాడ్యుయేట్లలో కొరవడ్డాయని తెలిపారు. నైపుణ్యాల పెంపొందించే ఉద్దేశంతోనే ‘‘యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ’’ స్థాపిస్తున్నామన్నారు. అన్ని కోర్సులు 50శాతం ప్రాక్టికల్ కాంపొనెంట్‌ను కలిగి ఉంటాయని చెప్పారు.