Homeఫ్లాష్ ఫ్లాష్SAMANTHA:అంత‌కు దిగ‌జారాలా..సమంత

SAMANTHA:అంత‌కు దిగ‌జారాలా..సమంత

SAMANTHA:సుదీర్ఘకాలం నుంచి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మల్లో సమంత ఒకరు. కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే సమంత నాగచైతన్యను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా రాణించింది. కానీ, ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో స‌క్సెస్ కాలేక‌పోయింది. పెళ్లైన నాలుగేళ్ల‌కు నాగచైతన్య(Naga Chaitanya)తో సమంత (Samantha) విడిపోయింది. అయితే విడాకుల తర్వాత సైతం సమంత కెరీర్ ఏమాత్రం డౌన్ కాలేదు.ఇంకా చెప్పాలంటే ఆమె కెరీర్ మరింత ఊపందుకుంది. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాలను లైన్ లో పెడుతూ అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంతలోనే సమంత(Samantha) మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైంది. ఈ వ్యాధి కారణంగా ఆమె షూటింగ్స్ లో పాల్గొనలేకపోయింది. ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ తన ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టింది.

ఆల్రెడీ `శాకుంతలం`(Shaakuntalam) ప్రమోషన్స్ లో భాగమైంది. అలాగే ఆగిపోయిన తన సినిమాలను మళ్లీ పట్టాలెక్కించేందుకు రెడీ అయింది. ఇలాంటి తరుణంలో సమంతకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. సమంత ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు పలు బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తుంది. ఆయా బ్రాండ్స్‌ ను ప్రమోట్ చేస్తూ యాడ్స్ లో నటిస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మ‌డు ఓ యాడ్ ఫిల్మ్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

బ్రా కంపెనీ యాడ్ కోసం

ఏముంది అనేగా మీ డౌట్.. విషయం ఏమిటంటే సమంత ఓకే చెప్పింది ఓ బ్రా కంపెనీ యాడ్ కోసం అని అంటున్నారు. ఇప్పటికే అన్ని మాట్లాడుకుని ఓకే అనుకున్నార‌ట‌. త్వరలోనే ఈ యాడ్ షూటింగ్ జరగబోతుందని.. ఈ యాడ్(ad) లో సమంత బ్రా వేసుకొని బీభత్సమైన ఎక్స్పోజింగ్ చేయబోతుందని ప్రచారం జరుగుతుంది. నెటిజ‌న్లు సమంతపై నిప్పులు చెరుగుతున్నారు. స్టార్ హీరోయిన్ హోదాలో ఉండి డబ్బుల కోసం అంత‌కు దిగ‌జారాలా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img