Homeఅంతర్జాతీయంSex:స్వీడన్ లో సెక్స్ కాంపిటేషన్స్

Sex:స్వీడన్ లో సెక్స్ కాంపిటేషన్స్

Sex: సెక్స్‌ గురించి బహిరంగంగా మాట్లాడటాన్నే కొంచెం ఇబ్బందిగా ఫీలయ్యే సమాజంలో ఉన్నాం! అలాంటిది సెక్స్‌ను దేశంలోని క్రీడల్లో ఓ క్రీడగా గుర్తింపునిచ్చి.. ఏకంగా శృంగార పోటీలు పెడితే? యూరప్‌ దేశమైన స్వీడన్‌ ఇదే చేస్తోందిప్పుడు. ప్రపంచంలోనే తొలిసారి సెక్స్‌ పోటీలకు అక్కడ రంగం సిద్ధమైంది. ‘యురోపియన్‌ సెక్స్‌ చాంపియన్‌షిప్‌’ పేరుతో వచ్చేవారమే స్వీడన్‌లో శృంగార పోటీలకు తెరలేవనుంది. ఫోర్‌ప్లే, ఓరల్‌ సెక్స్‌, అంగప్రవేశం, శృంగారానికి ప్రేరేపించే పద్ధతులు తదితర 16 విభాగాల్లో పోటీలు ఉంటాయి. కొన్ని రోజుల పాటు సాగే ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఇప్పటికే 20 జంటలు నమోదు చేసుకున్నట్లు సమాచారం. ఇతర క్రీడాల్లో మాదిరిగానే ఈ శృంగార క్రీడల్లోనూ ప్రత్యేకంగా విధివిధానాలను నిర్ణయించారు. రోజుకు ఆరు గంటల పాటు సెక్స్‌ సెషన్స్‌ ఉంటాయి. ఒక జంట కనీసం 40–45 నిమిషాల పాటు శృంగార ఆనందంలో మునిగి తేలాల్సి ఉంటుంది. మరో విశేషం ఏమిటంటే విజేతను నిర్ణయించడానికి జడ్జిలతో పాటు ఎంపిక చేసిన వీక్షకులూ ఉంటారు. శృంగార లోకంలో విహరించేటప్పుడు ఆ జంటల మధ్య కెమిస్ట్రీ, సంభాషణలు, శృంగార సామర్థ్య స్థాయులు తదితర అంశాలను బట్టి పాయింట్లు ఇస్తారు. భారతీయ శృంగార శాస్త్రమైన కామసూత్రపై అవగాహనను సెక్స్‌ కేళిలో ప్రదర్శిస్తే అది బోనస్సే! ఈ సెక్స్‌ పోటీలపై నెటిజన్లలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

Recent

- Advertisment -spot_img