కృష్ణపట్నం పోర్టు విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బందిపై చేసిన టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి దాడి చేసారు.తనిఖీలు లేకుండా తన మనుషులను పోర్టు లోపలికి పంపాలేదని కారణంతో సెక్యూరిటీపై అయన మండిపడ్డారు. తమకే అడ్డు చెబుతారా అంటూ భద్రతా సిబ్బందిని ఎమ్మెల్యే బండ బూతులు తిట్టారు. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ పనులు నిలిచిపోయాయి. వీధిన పడిన పారిశ్రామికవేత్తల కోసం బందరు పోర్టు సీఈవోతో మాట్లాడేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఎం పార్టీల నేతలతో పాటు మీడియా ప్రతినిధులు కూడా వెళ్లారు. అయితే మీడియాను పోర్టు సిబ్బంది అడ్డుకున్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పినా సెక్యూరిటీ వినలేదు. దీంతో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.