Homeతెలంగాణhigh court:హైకోర్టులో వనమాకు చుక్కెదురు

high court:హైకోర్టులో వనమాకు చుక్కెదురు

హైకోర్టులో వనమాకు చుక్కెదురు

  • మధ్యంతర పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

ఇదేనిజం, హైదరాబాద్: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావుకు తెలంగాణ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదని ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. అందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. వనమా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు చెప్పింది. ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడంతో వనమాను హైకోర్టు అనర్హుడిగా ప్రకటిస్తూ ఈ నెల 25న హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమాను అనర్హుడిగా నిర్ధారిస్తూనే.. రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును 2018 డిసెంబల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రకటించింది. కాగా, తన ఎన్నిక చెల్లదని ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తానని.. అప్పటి వరకు హైకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ బుధవారం మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. నిన్ననే ఈ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. హైకోర్టు తీర్పు సర్టిఫైడ్ కాపీ రాలేదని, అది వచ్చాక సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని పేర్కొన్నారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసి ఇవ్వాల వెల్లడించింది. ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరావు అనర్హత వేటు తీర్పుపై స్టే ఇవ్వబోమని.. ఆయన వేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టి వేస్తున్నామని ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.

Recent

- Advertisment -spot_img