Homeఆంధ్రప్రదేశ్TTD : తిరుమలలో సర్వ దర్శనం నిలిపివేత

TTD : తిరుమలలో సర్వ దర్శనం నిలిపివేత

– భారీగా తరలివచ్చిన భక్తులు
– నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్​ –2, నారాయణగిరి షెడ్లు

ఇదేనిజం, ఏపీ బ్యూరో: టీటీడీ అధికారులు తిరుమలలో సర్వ దర్శనం నిలిపివేశారు. శనివారం వైకుంఠ ఏకాదశి కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్​–2, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో అధికారులు సర్వ దర్శనం నిలిపివేశారు. టికెట్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చిన భక్తులను టీటీడీ అధికారులు క్యూలైన్లలోకి అనుమతించడం లేదు. దీంతో ఏటీసీ వద్ద టీటీడీ విజిలెన్స్‌ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు. నారాయణగిరి అతిథి గృహం వరకు క్యూలైన్‌ చేరుకుంది. దీంతో వైకుంఠద్వార దర్శనానికి ఇబ్బంది కలుగుతుందని భావించి, టోకెన్లు లేని వారిని దర్శనానికి తితిదే అధికారులు నిరాకరించారు. రేపటి సర్వదర్శన టికెట్లు ఉన్న వారిని సాయంత్రం క్యూ లైన్లలోకి పంపిస్తామని తెలిపారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం టోకెన్లు లేకపోయినా సర్వదర్శనానికి అనుమతిస్తామని టీటీడీ తొలుత ప్రకటించింది. దీంతో భక్తులు భారీగా తరలివచ్చారు.

Recent

- Advertisment -spot_img