Homeసైన్స్​ & టెక్నాలజీWhatsApp new features : వాట్సాప్‌లో ఫొటో ఎడిట్​ టూల్

WhatsApp new features : వాట్సాప్‌లో ఫొటో ఎడిట్​ టూల్

WhatsApp new features : వాట్సాప్‌లో ఫొటో ఎడిట్​ టూల్

WhatsApp new features : ఫొటో ఎడిట్​ టూల్​ను వాట్సాప్ మొబైల్ వెర్షన్​లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోంది.

ఈ టూల్‌తో యూజర్లు తాము పంపే ఫొటోలను క్రాప్‌ చేయడం, ఫొటోలపై ఎమోజీలు, జిఫ్‌, టెక్ట్స్‌ను అమర్చడం వంటివి చేయొచ్చు.

వీటితో పాటు డెస్క్​టాప్ యూజర్ల కోసం కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది వాట్సాప్.

LG Waterless Washing Machine : నీరు, సర్ఫ్​ అక్కర్లేని వాషింగ్ మెషీన్

Water on Moon : చంద్రుడిపై చైనా ల్యాండర్ తీసిన ఫోటోలో నీటి ఆన‌వాళ్లు

మొబైల్‌ యూజర్లకు వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది.

ఇప్పటి వరకు డెస్క్‌టాప్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న డ్రాయింగ్ టూల్‌/ఫొటో ఎడిట్‌ టూల్‌ను త్వరలో మొబైల్ వెర్షన్‌లో కూడా తీసుకొస్తున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది.

మొబైల్‌ వాట్సాప్‌లో రెండు వెర్షన్లలో ఈ టూల్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం.

ఇందులో ఒకటి ఫొటోల కోసం కాగా, రెండోది వీడియోలను ఎడిట్‌ చేసేందుకని వాబీటాఇన్ఫో వెల్లడించింది.

ఈ టూల్‌తో యూజర్లు తాము ఇతరులకు పంపే ఫొటోలను క్రాప్‌ చేయడంతోపాటు, ఫొటోలపై ఎమోజీలు, జిఫ్‌, టెక్ట్స్‌ను యాడ్‌ చేయొచ్చు.

వీడియోలకు ఈ టూల్ ఎలా ఉపయోగపడుతుందనేది తెలియాల్సి ఉంది.

Robots : ఈ రోబో మనిషి మెద‌డునే చ‌దివేస్తుంది

Omicron Alert : ఒమిక్రాన్‌కు మ‌రో రెండు కొత్త లక్షణాలు..

ఇవేకాకుండా వాట్సాప్‌ డెస్క్‌టాప్ యూజర్ల కోసం యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ)లో మార్పులు చేయడంతోపాటు, చాట్ బబుల్స్‌ అనే కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.

అలానే చాట్‌ బార్‌ రంగులు కూడా మార్చుకునేందుకు వీలుగా కొత్త అప్‌డేట్‌ను పరిచయం చేయనుంది.

వీటితోపాటు బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌ మెసేజ్‌, చాట్‌ లిస్ట్‌లో మార్పులు, అడ్వాన్స్‌డ్‌ సెర్చ్‌ వంటి కొత్త పీచర్లను వాట్సాప్ తీసుకురానుంది.

మిగతా మెసేజింగ్‌ యాప్‌లతో పోలిస్తే గత కొద్ది నెలలుగా వరుస కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వాట్సాప్ వినియోగాన్ని మరింత యూజర్‌ ఫ్రెండ్లీ యాప్‌గా మార్చే ప్రయత్నం చేస్తోంది.

WhatsApp DP : వాట్సాప్​ డీపీలుగా సొంత ఫోటోలు పెడుతున్నారా

E Passport | ఇక దొంగ పాస్‌పోర్ట్‌ల‌కు చెక్‌

Airplane drops human waste : విమానంలో బాత్‌రూమ్​ వ్యర్థాలు గాలిలోనే జనాల మీద వదిలేస్తారా

Recent

- Advertisment -spot_img