వైసీపీ అధినేత జగన్ ముహూర్తాలను చూసుకుంటూ అడుగులు వేస్తున్నారు. దీంతో రానున్న శ్రావణమాసంలో సంచలన నిర్ణయాలు ఉంటాయని ప్రచారం సాగుతోంది. ఈనెలలో నిర్వహించాలనుకున్న ప్రజా దర్బార్ కార్యక్రమం వాయిదా పడింది. అయితే ఆషాడమాసం కావడంతోనే ప్రజాదర్బార్ని జగన్ ప్రారంభించలేదని అంటున్నారు. ఆగస్టు 5 నుంచి శ్రావణమాసం మొదలవుతోంది. దాంతో జగన్ ప్రజా దర్బార్ని ఆగస్టు మొదటి వారంలో నిర్వహించడానికి ముహూర్తం నిర్ణయించారని అంటున్నారు.