కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన రేవంత్ రెడ్డి అనంతరం ప్రసంగించారు.
దేశంలోని కొన్ని రాజకీయపార్టీలు తమ ప్రయోజనాల కోసం మతాల మధ్య చిచ్చుపెడుతున్నాయని చెప్పారు.
రైతులకు ఉచిత విద్యుత్, మద్దతు ధర, భూములపై సీలింగ్ యాక్ట్ తెచ్చి దళితులకు, గిరిజనులకు, వెనుకబడిన వర్గాలకు గతంలో కాంగ్రెస్ పార్టీ హక్కు కల్పించిందని ఆయన చెప్పారు.
అయితే, దేశంలో మోదీ ప్రభుత్వం వచ్చాక పాసిస్టు విధానాలు అవలంబిస్తున్నారని ఆరోపించారు.
రైతుల జీవితాలను కట్టుబానిసలుగా మార్చుతున్నారని అన్నారు. మరోవైపు రాష్ట్రంలోనూ సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో దళిత, గిరిజనుల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు.
గత తమ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిచ్చిందని ఆయన చెప్పారు. కేసీఆర్ మాత్రం హరితహారం పేరుతో అటవీశాఖ అధికారులతో కలిసి వారిని హింసించి లాక్కుంటున్నారని ఆయన ఆరోపించారు.
కేంద్రంలో మోదీని, తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించినప్పుడే రైతులకు, యువతకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని ఆయన చెప్పుకొచ్చారు.
ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్.. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోదీ నిరుద్యోగులను మోసం చేశారని ఆయన అన్నారు.