ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామ శివారులో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను బ్లూ కోర్టు సిబ్బంది శ్రీనివాస్ వెంకటి ఇసుక ట్రాక్టర్ ను పట్టుకొని స్టేషన్ కు తరలిస్తున్న క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ మూడవది విజయ్ అతివేగంగా వెళ్లడంతో రోడ్డు గుంతలుగా ఉండడంతో ఇసుకతో ఉన్న ట్రాక్టర్ ట్రాలీ సైడ్ ఒక పక్క బోల్తా పడడంతో ట్రాలీపైన కూర్చున్న హోంగార్డ్ వెంకటి కింద పడగా ముఖానికి మోకాలుకు స్వల్ప గాయాలు అయ్యాయి.. పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.