Traffic:హైదరాబాద్ సిటీ నడి బొడ్డున మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్ రూట్లో ట్రాఫిక్ జాం అయ్యింది. జూన్ 7వ తేదీ ఉదయం ఓ ఆయిల్ ట్యాంకర్ ఈ రహదారిలో బోల్తా పడటంతో.. ట్యాంకర్ లోని ఆయిల్ అంతా రోడ్డుపై పడిపోయింది. దీంతో వాహనాలు జారిపోతున్నాయి. దీంతో వాహనాలు అన్నీ రోడ్డుకు పక్కగా.. వెళుతుండటంతో.. ట్రాఫిక్ మొత్తం జాం అయ్యింది. ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయం కావటంతో.. ఒక్కసారిగా వేలాది వాహనాలు రోడ్డు ఎక్కటంతో.. ఐదు కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రాంతం ట్రాఫిక్ జాం అయ్యింది.
మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, లక్డీకాపూల్, మెహదీపట్నం – గచ్చిబౌలి రూట్లలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రెండు గంటలుగా వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగినా పరిస్థితిలో మార్పు లేదు. రోడ్డుపై పడిన ఆయిల్ పై ఇసుక, మట్టి వేస్తున్నారు. అయినా వాహనాలు జారుతుండటంతో.. నిదానంగా సాగుతున్నాయి. సహజంగా ఈ రహదారిలో నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. అలాంటి రూట్లో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడటంతో.. ట్రాఫిక్ జాం అయిపోయింది. ఉదయం 8, 9 గంటలకు ఇళ్ల నుంచి బయలుదేరిన వాహనదారులు.. 11 గంటల వరకు ఆఫీసులకు చేరుకోలేదు.