Traffic : హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. నగరంలో ప్రత్యేకత కలిగిన రెండు ఫ్లైఓవర్ల నుంచి ఇది జరుగుతుంది. గచ్చిబౌలి ఓఆర్‌ఆర్ నుంచి కొండాపూర్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ను అరికట్టేందుకు రూ.200 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ నుండి కొండాపూర్ వరకు దాదాపు 1.2 కిలోమీటర్ల పొడవు మరియు 24 మీటర్ల వెడల్పుతో నిర్మాణ పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. వచ్చే నెలలో ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించడానికి GHMC అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ బహుళస్థాయి ఫ్లైఓవర్. కింద రెండు ఫ్లైఓవర్లు ఉండగా, దాని పైన మూడో ఫ్లై ఓవర్ నిర్మించారు.