హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఫ్లై ఓవర్ల నిర్మాణం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి జంక్షన్‌లో శిల్పా లేఅవుట్ లెవల్-2 ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నిమిత్తం ఐదు రోజుల పాటు ఫ్లైఓవర్‌ను మూసివేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఆగస్టు 8 నుంచి 12 వరకు గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ని రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేస్తున్నారు. ఆ సమయంలో బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఐఐఐటీ జంక్షన్ వైపు వెళ్లే వాహనదారులు మళ్లీ ఫ్లైఓవర్ దిగువ నుంచి టెలికాం నగర్, గచ్చిబౌలి జంక్షన్ మీదుగా ఐఐఐటీ వైపు మళ్లీంచనున్నారు.