Homeహైదరాబాద్latest Newsన్యూ ఇయర్ వేళ.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు..!

న్యూ ఇయర్ వేళ.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు..!

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో ఇవాళ రాత్రి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్ అనుమతించరు. అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల వరకు హుస్సేన్సాగర్ చుట్టూ వాహనాల రాకపోకలపై అవసరాన్ని బట్టి ఆంక్షలు ఉంటాయి. బేగంపేట్, టోలిచౌకీ మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు రాత్రి నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు మూసివేస్తారు. టికెట్ ఉన్న వారికి శంషాబాద్ విమానాశ్రయానికి అనుమతిస్తారు.

Recent

- Advertisment -spot_img