Homeహైదరాబాద్latest Newsనేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

నేడు హైదరాబాద్‌లోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుంజోషి వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు చెంగిచర్ల, బోడుప్పల్, ఫిర్జాదిగూడ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హెచ్‌ఎండీఏ భగాయత్ లేఅవుట్ మీదుగా నాగోలు వైపు వెళ్లాలని సూచించారు. ఎల్‌బీనగర్‌ నుంచి నాగోల్‌ మీదుగా ఉప్పల్‌ వైపు వచ్చే వాహనాలు నాగోల్‌ మెట్రో స్టేషన్‌ వద్ద యూ టర్న్‌ తీసుకుని భగాయత్‌ లేఅవుట్‌ మీదుగా బోడుప్పల్‌, ఫిర్జాదిగూడ వైపు వెళ్లాలని సూచించారు. తార్నాక నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ మీదుగా నాచారం, మల్లాపూర్ వైపు వెళ్లాలని తెలిపారు. ఈ సూచనలను పాటించి ప్రత్యామ్నాయ వాహనదారులు మార్గాల్లో వెళ్లాలని తరుణ్ జోషి తెలిపారు.

Recent

- Advertisment -spot_img