భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉప్పల్ స్టేడియంలో శనివారం మూడో టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు రాచకొండ సీపీ తెలిపారు. మ్యాచ్‌ను తిలకించేందుకు వేలాదిగా సందర్శకులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఉప్పల్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో నిర్దేశిత ప్రాంతాల నుంచి వాహనదారులు వెళ్లాల్సి ఉంటుందని సూచించారు.