Homeహైదరాబాద్latest News''గేమ్ ఛేంజర్'' మూవీ ఈవెంట్‌లో విషాదం.. ఇద్దరు మృతి

”గేమ్ ఛేంజర్” మూవీ ఈవెంట్‌లో విషాదం.. ఇద్దరు మృతి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘గేమ్ ఛేంజర్. ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లో విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగింది. ఈ సినిమా ఫంక్షన్‌లో విషాదం నెలకొంది. ఈ ఫంక్షన్‌కు వచ్చి తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కాకినాడకు చెందిన అరవపల్లి మణికంఠ, తోకాడ చరణ్ అనే ఇద్దరు యువకులు వెళ్లారు. ఈవెంట్‌ ముగిసిన తరువాత కాకినాడ వైపు వస్తుండగా కార్గిల్ ఫ్యాక్టరీ వద్ద వ్యాన్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మణికంఠ అక్కడికక్కడే మృతి చెందగా, చరణ్ జీజీహెచ్ ద్వారా కాకినాడకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

Recent

- Advertisment -spot_img