Homeహైదరాబాద్latest Newsకేసీఆర్ ఇంట్లో విషాదం.. సోదరి చీటీ సకలమ్మ కన్నుమూత.. నివాళులర్పించిన కేసీఆర్..!

కేసీఆర్ ఇంట్లో విషాదం.. సోదరి చీటీ సకలమ్మ కన్నుమూత.. నివాళులర్పించిన కేసీఆర్..!

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేసీఆర్ సోదరి చీటి సకలమ్మ (82) కన్నుమూశారు. దీంతో ఆమె పార్థివదేహానికి కేసీఆర్ నివాళులర్పించారు. అలాగే సకులమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చారు కేసీఆర్. గత కొంత కాలంగా చీటి సకలమ్మ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌ సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కేసీఆర్‌ కు సకలమ్మ ఐదో సోదరి. సకలమ్మ మరణవార్త తెలుసుకున్న వెంటనే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్‌రావు హుటాహుటిన ఆసుపత్రికి తరలివెళ్లారు. జరుగాల్సిన కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్నారు.

Recent

- Advertisment -spot_img