భారీ వర్షం నడుమ హైదరాబాద్ లోని రాంనగర్ ప్రాంతంలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ఓ వ్యక్తి చనిపోయారు. అతని మృతదేహం పార్సీ గుట్ట వద్ద వరద నీటిలో రోడ్డుపైకి కొట్టుకొచ్చింది. మృతుడిని విజయ్ అనే 43 ఏళ్ల దినసరి కూలీగా పోలీసులు గుర్తించారు. రాంనగర్లో లోనే మరో వ్యక్తి స్కూటీతో పాటు వరద ప్రవాహంలో కొట్టుకుపోతుండగా ఇద్దరు యువకులు కాపాడారు. హైదరాబాద్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడుతోంది.