తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, జర్నలిస్ట్ ఆర్. సత్యనారాయణ మృతి చెందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి జిల్లా వార్త రిపోర్టర్ గా పనిచేస్తూ.. బీఆర్ఎస్ పార్టీలో చేరి రాష్ట్రా సాధనకు ఎంతో కృషి చేశారు. బీఆర్ఎస్ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీగా సత్యనారాయణ గెలుపొందారు. పదవీకాలం ఉండగానే రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. తర్వాత కేసీఆర్ టీఎస్పీస్సీ కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించారు. ఈయన మృతికి రాజకీయ నాయకులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.
ఆర్. సత్యనారాయణ మృతికి పలువురు నేతలు సంతాపం
మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్. సత్యనారాయణ మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, శాసనమండలి సభ్యుడిగా సత్యనారాయణ చేసిన సేవలు తెలంగాణ సమాజం మరిచిపోలేనివి అని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ముఖ్యమంత్రి.
మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సత్యనారాయణ సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు హరీష్ రావు.