హైదరాబాద్‌లోని జీడిమెట్ల గాజుల రామారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు పిల్లలను చంపి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను మంచిర్యాలకు చెందిన దంపతులు వెంకటేశ్ (40), వర్షిణి (33), పిల్లలు రిషికాంత్(11), విహంత్ (3)గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆర్థిక ఇబ్బందులతోనే దంపతులు తమ పిల్లలను చంపి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.