కొత్త సంవత్సరం సందర్భంగా అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక వాహనం జనంపైకి దూసుకెళ్లడంతో 10 మంది మృతి చెందారు.ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. ఫ్రెంచ్ క్వార్టర్ ఆఫ్ న్యూ ఓర్లీన్స్‌లోని బోర్బన్ స్ట్రీట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను ఉగ్రవాదుల దాడిగా నగర మేయర్ అభివర్ణించారు.అయితే ఈ ఘటన లో ట్రక్కు నుండి దూకిన వ్యక్తి కాల్పులు ప్రారంభించాడు. అక్కడే ఉన్న పోలీసులు కూడా వెంటనే కాల్పులు జరిపారు. న్యూ ఓర్లీన్స్‌లోని ఫ్రెంచ్ క్వార్టర్ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.