కోలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. సూర్య నటించిన ‘సింగం’ సినిమాలో ప్రేక్షకుల్ని మెప్పించిన తమిళ ప్రముఖ నటుడు అరుళ్మణి మృతి చెందారు. 65 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. దీంతొ కోలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.