Homeహైదరాబాద్latest Newsసినీ పరిశ్రమలో విషాదం.. కుళ్లిన స్థితిలో ప్రముఖ నటుడి మృతదేహం లభ్యం..!!

సినీ పరిశ్రమలో విషాదం.. కుళ్లిన స్థితిలో ప్రముఖ నటుడి మృతదేహం లభ్యం..!!

సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు దిలీప్‌ శంకర్‌ కన్నుమూశారు. ప్రముఖ సినీ, బుల్లితెర నటుడు, సీరియల్స్‌లో వైవిధ్యభరితమైన పాత్రలకు పేరుగాంచిన దిలీప్ శంకర్ ఒక హోటల్ గదిలో శవమై కనిపించినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. 50 ఏళ్ల నటుడు డిసెంబర్ 19 న సీరియల్ షూటింగ్ ప్రాజెక్ట్ కోసం ఒక హోటల్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజులుగా అతడు తన గది నుంచి బయటకు రాలేదని హోటల్ సిబ్బంది తెలిపారు. ఆదివారం ఉదయం గది నుంచి దుర్వాసన రావడంతో హోటల్‌ సిబ్బంది గదిలోకి వెళ్లి చూడగా కుళ్లిన స్థితిలో అతను శవమై కనిపించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. రెండు రోజుల క్రితం మృతి చెందినట్లు భావిస్తున్నారు. నటుడు కాలేయ సంబంధిత ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. సీరియల్స్‌లో పని చేయడంతో పాటు, శంకర్ అనేక చిత్రాలలో కూడా చెప్పుకోదగ్గ పాత్రలు పోషించాడు.

Recent

- Advertisment -spot_img