ఇదే నిజం, ధర్మపురి రూరల్: ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన గడ్డి పోషం వయస్సు 56 సంవత్సరాలు అనే వ్యక్తి తేదీ 12/06/2024 నాడు జైన గ్రామానికి చెందిన బోరే లక్ష్మణ్ అనే అతని ఇంటి నిర్మాణం పనికి వెళ్లి పనిచేస్తుండగా పరాంచనుండి ప్రమాదవశాత్తు కాలు జారీ కింద పడడం వల్ల దెబ్బలు తగలగా చుట్టుపక్కల వాళ్ళు వెంటనే చికిత్స నిమిత్తం 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి జగిత్యాలకు తరలించగ చనిపోయాడు. మృతురాలి భార్య గడ్డి శంకరవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం చేశారు.