పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉంగుటూరు మండలానికి చెందిన రాజేష్, ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఆత్మహత్య చేసుకుందామని గురువారం రాత్రి పాలకొల్లు రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాలపైకి చేరుకున్నారు. ట్రైన్ దగ్గరకు రాగానే ప్రియురాలిని పక్కకి నెట్టిన రాజేష్.. తాను మాత్రం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.