ఉత్తరప్రదేశ్లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కాన్పూర్, భీమ్సేన్ రైల్వే స్టేషన్ల మధ్య బ్లాక్ సెక్షన్లో సబర్మతి ఎక్స్ప్రెస్ (19168) పట్టాలు తప్పింది. శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు ట్రాక్‌పై బండరాయి ఎక్కడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు రైల్వే అధికారు తెలిపారు. దీంతో 20 బోగీలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో రైలులోని ప్రయాణికులను తీసుకెళ్లడానికి రైల్వే అధికారులు ప్రత్యేక బస్సులను ఘటనా స్థలంలో ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పోలీసులు, ఐబీ దర్యాప్తు చేపట్టాయి.