Train accident : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం(Train accident) జరిగింది. మంగళవారం కాన్పూర్ మరియు ఫతేపూర్ మధ్య ఖాగా ప్రాంతంలో పట్టాలపై ఆగి ఉన్న గూడ్స్ రైలును ఎదురుగా వేగంగా వెళ్తున్న మరో గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో గూడ్స్ రైళ్లలోని ఇద్దరు లోకో పైలట్లు గాయపడ్డారు. గూడ్స్ రైలు కంపార్ట్‌మెంట్లు పట్టాలు తప్పి సమీపంలోని లోయలో పడిపోయాయి. సంఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.