Train hijack : బలూచిస్థాన్ లో ట్రైన్ పై మిలిటెంట్ల దాడి చేసి హైజాక్ (Train hijack) చేసింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్వెట్టా నుండి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసి, దాదాపు 400 మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకుంది. పాకిస్తాన్ సైన్యాన్ని జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తూ, సైనిక చర్యకు ప్రయత్నించిన ప్రతిసారీ బందీలుగా ఉన్న వారందరినీ ఉరితీస్తామని BLA హెచ్చరించింది. రైలును తాము తమ ఆధీనంలోకి తీసుకున్నామని, ఆరుగురు సైనిక సిబ్బంది మరణించారని, ప్రయాణికులను బందీలుగా తీసుకున్నామని ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.