ప్రపంచంలోనే అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌ను భారతదేశం కలిగి ఉంది. ప్రతిరోజూ 13,000 కంటే ఎక్కువ రైళ్లు నడుస్తాయి. అయితే గత 75 ఏళ్లుగా ప్రయాణికులకు ఉచిత సేవలందిస్తున్న ఒక రైలు మన భారత దేశంలోనే ఉంది. ఈ రైలులో ప్రయాణించేందుకు టిక్కెట్టు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఈ రైలులో ప్రయాణించాలనుకునే వారు ఉచితంగా ప్రయాణించవచ్చు. 75 ఏళ్లుగా ఉచిత సేవలు అందిస్తున్న ఏకైక రైలు భాక్రా నంగల్. ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని నంగల్, పంజాబ్ మరియు భాక్రా మధ్య నడుస్తుంది.ఈ రైలు 1948 నుంచి నడుస్తోంది.1953లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న డీజిల్ ఇంజన్లతో అధికారులు ఈ రైలును అప్‌గ్రేడ్ చేశారు. ఈ రైలులో టిక్కెట్లు లేకపోవడానికి గల కారణం…ఇది వఖ్రా-బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్ (BBMB)చే నిర్వహించబడుతుంది. గంటకు 18 నుంచి 20 గ్యాలన్ల ఇంధనాన్ని వినియోగించే ఈ రైలుకు టికెట్లు తీసుకోవాలని బీబీఎంబీ నిర్ణయించింది. అయితే సుదీర్ఘ రైల్వే వ్యవస్థకు సజీవ సాక్ష్యంగా నిలిచే ఈ రైలు చరిత్రను గౌరవిస్తూదీన్ని ఉచితంగానే కొనసాగించాలని నిర్ణయించారు. ప్రతిరోజూ 800 మందికి పైగా ఉచితంగా ఈ రైలులో ప్రయాణిస్తారు. చాలా మంది సందర్శకులకు ఇది అద్భుతమైన రైలు ప్రయాణం. ముఖ్యంగా ఈ రైలు మార్గంలో ఉన్న అద్భుతమైన భాక్రా-నంగల్ డ్యామ్ మరియు శివాలిక్ కొండలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.ఈ రైలు నంగల్ రైల్వే స్టేషన్ నుండి 7:05 AMకి బయలుదేరి 8:20 గంటలకు భాక్రా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నంగల్‌లో మధ్యాహ్నం 3.05 గంటలకు బయలుదేరి 4.20 గంటలకు భాక్రా రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.