తెలంగాణలో 8 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టి.కె.శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషషనర్‌గా, విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శి ఎస్.హరీశ్‌కు రవాణా, ఆర్అండ్బీ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్‌కుమార్, పురపాలక శాఖ ఉపకార్యదర్శిగా ప్రియాంక, హాకా ఎండీగా చంద్రశేఖర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ ఎండీగా శ్రీనివాస్‌రెడ్డి, రవాణా, ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్ బదిలీ అయ్యారు.