హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్లను నియమించేందుకు దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లేవారిని నిరోధించేందుకు ప్రత్యేక డ్రెస్ కోడ్‌తో హోమ్ గార్డుల తరహాలో ట్రాన్స్జెండర్ల సేవలను ఉపయోగించుకోవాలని అన్నారు. అయితే వీరికి జీతభత్యం కింద రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఇవ్వనున్నారు. ఈ నిర్ణయాన్ని త్వరగా అమలు చేయాలని సూచించారు.