ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని రజక సంఘం అధ్యక్షుడు కలకోట సత్యం ఇంటికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రావడం జరిగింది. నూతనంగా రజక సంఘానికి అధ్యక్షుడిగా నియామకమైన సత్యంని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం చందోలి సింగిల్ విండో చైర్మన్ మాధవరావు, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు కోమల్ల జలంధర్, శోభన్,తదితరులు పాల్గొన్నారు.