Homeహైదరాబాద్latest Newsమహిళా శక్తికి సన్మానం : Hyderabad Crime News

మహిళా శక్తికి సన్మానం : Hyderabad Crime News

– దొంగను ధైర్యంగా ఎదిరించిన తల్లీకుమార్తెను సన్మానించిన డీసీపీ

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో:
బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రసూల్‌పురా జైన్‌ కాలనీలో ఓ ఇంట్లో చొరబడి దొంగతానికి యత్నించిన దుండగులను తరిమేందుకు తల్లీకుమార్తెలు చేసిన సాహసం స్ఫూర్తిగా నిలుస్తోంది. దుండగుడి చేతిలో తుపాకీ ఉన్నా.. ఏమాత్రం వణుకూ బెణుకూ లేకుండా వారిద్దరూ ఎదిరించిన తీరు మహిళా శక్తిని మరోసారి చాటింది. ఆ తల్లీకుమార్తెల ధైర్యసాహసాలను మెచ్చిన సికింద్రాబాద్‌ నార్త్‌జోన్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని(DCP Rohini PriyaDarshini).. శుక్రవారం వారిని సన్మానించారు.

Recent

- Advertisment -spot_img