‘యానిమాల్’ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయింది త్రిప్తి డిమ్రి. చేసింది చిన్న పాత్రే అయినా యువతరంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడికి బాలీవుడ్లో భారీ ఆఫర్లొస్తున్నాయి. శుక్రవారం ఈ భామ 30వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ప్రియుడు సామ్ మర్చంట్ ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘నా ప్రియమైన త్రిప్తికి శుభాకాంక్షలు’ అంటూ ఇద్దరూ కలిసి ఉన్న ఓ ఫొటోను షేర్ చేశారు. దాంతో ఈ అమ్మడి ప్రేమాయణం హాట్‌టాపిక్‌గా మారింది. మీ పరిచయం ఎక్కడ మొదలైంది?.. ఎన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు?.. అంటూ నెటిజన్లు ప్రశ్నలతో ముంచెత్తారు. సామ్మర్చంట్ తొలుత మోడల్‌గా పనిచేసి ప్రస్తుతం వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. గోవాలో అతనికి బీచ్ క్లబ్స్‌తో పాటు పలు హోటల్స్ ఉన్నాయని తెలిసింది.