Homeహైదరాబాద్latest NewsTrivikram : ''ఓజీ'' మూవీ సెట్స్ లో త్రివిక్రమ్.. సుజీత్ కు సలహాలు.. మరో ''బ్రో''...

Trivikram : ”ఓజీ” మూవీ సెట్స్ లో త్రివిక్రమ్.. సుజీత్ కు సలహాలు.. మరో ”బ్రో” అవుతుందా..?

Trivikram : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాని యువ దర్శకుడు సుజీత్ రూపొందిస్తుండగా డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్నారు. ఇటీవల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం ఏమిటంటే, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘ఓజీ’ సెట్స్‌లో కనిపించడం, సుజీత్‌కు కొన్ని సీన్స్‌కు సంబంధించి సలహాలు ఇవ్వడం అభిమానాల్లో కొంత కలత చెందుతున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తన దర్శకత్వంలో పవన్ కళ్యాణ్‌తో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ వంటి సినిమాలు చేసి బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించాడు. ఆ తరువాత చేసిన ”అజ్ఞాతవాసి” సినిమా మాత్రం పెద్ద ప్లాప్ గా నిలిచింది. మళ్ళీ త్రివిక్రమ్ పవన్‌తో ”బ్రో”, ”భీమ్లా నాయక్” సినిమాలకు స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. ఈ సినిమాలకు దర్శకలు వేరే అయ్యినప్పటికీ.. త్రివిక్రమ్ కన్ను సన్నులోనే ఆ సినిమాలు జరిగాయి. అయితే ఆ సినిమాలు పూర్తిగా పవన్ ఫ్యాన్స్ ను నిరాశపరిచాయి. ”భీమ్లా నాయక్” సినిమా కొంత మేరుకు అక్కటుకుంది కానీ ”బ్రో” సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు త్రివిక్రమ్ మరోసారి ‘ఓజీ’ సెట్స్‌లో కనిపించడం, సుజీత్‌తో కలిసి కొన్ని సీన్స్‌పై చర్చించడం అభిమానుల్లో కొత్త నిరాశ నెలకొంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, త్రివిక్రమ్ ‘ఓజీ’ స్క్రిప్ట్‌లో పెద్దగా మార్పులు చేయడం లేదు.. కానీ కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించి సూచనలు ఇస్తున్నారు అని సమాచారం. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొంతమంది పవన్ అభిమానులు త్రివిక్రమ్ ఎంట్రీని వ్యతిరేకిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img