హైదరాబాద్ః కరోనా రాజకీయ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న నాయకులు కరోనా బారీన పడుతున్నారు. తాజాగా సిర్పూర్ కాగజ్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కరోనా పాజిటివ్ గా తేలారు. అయన భార్యకు కూడా కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే ర్యాపిడ్ టెస్టులు చేయించుకున్నారని, ఈ టెస్టులో పాజిటివ్ గా నిర్ధారణ జరిగిందని అధికారులు పేర్కొన్నారు.