Homeవిద్య & ఉద్యోగంఅంతర్ జిల్లాల బదిలీలో టీఆర్టీ 2017 అభ్యర్థులకు అవకాశం కల్పించాలి

అంతర్ జిల్లాల బదిలీలో టీఆర్టీ 2017 అభ్యర్థులకు అవకాశం కల్పించాలి

హైదరాబాద్: త‌్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న అంతర్ జిల్లాల బదిలీల్లో టీఆర్టీ 2017 అభ్యర్థులకు అవకాశం కల్పించాలని TRTSU రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ కోరారు.

ఈ మేర‌కు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డిని త‌న నివాసంలో క‌లిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మ‌ణ్ మాట్లాడారు.

గత ఎనిమిది సంవత్సరాలుగా అంతర్ జిల్లా బదిలీలు లేనందువల్ల ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నార‌న్నారు. అంత‌ర్ జిల్లాల బదిలీలకు కనీసం 2 సంవత్సరాల సర్వీస్ అనే నిబంధన స‌డ‌లించాల‌ని మంత్రిని కోరామ‌న్నారు.

బ‌దిలీల‌కు జీరో ఇయర్‌ను పరిగణలోకి తీసుకొని TRT 2017 ద్వారా నియమితులై ఒక సంవత్సరం సర్వీసు పూర్తిచేసుకున్నటీచ‌ర్ల‌కు బ‌దిలీకి అవ‌కాశం క‌ల్పించాల‌న్నారు.

TRT-2017 ద్వారా నియామకం అయి, కరోనాబారిన పడిన ఉపాధ్యాయులకు 28 రోజుల ముందస్తు అర్ధవేతన సెలవులు మంజూరు చేయవలసిందిగా అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో TRTSU స‌భ్యులు రవితేజ, అనిల్, మహేష్, పృధ్వీ, రవి, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img