Homeహైదరాబాద్latest Newsఅమ్మ గురించి.. ఇదేనిజం

అమ్మ గురించి.. ఇదేనిజం

  • ప్రసవవేదనను సంతోషంగా తట్టుకునే అమ్మ ప్రేమ వర్ణించలేనిది.
  • తీయని మాటలు, ప్రేమతో తన సద్గుణాలను పంచి మంచివ్యక్తిగా రూపుదిద్దేది అమ్మ.
  • మరణం వరకూ తోడుగా ఉంటూ అన్‌కండిషనల్ లవ్ చూపించేది అమ్మే.

ఇదేనిజం, వెబ్‌డెస్క్ : అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎప్పటికప్పుడు బిడ్డ యోగక్షేమాలే తన ధ్యేయం. జీవితంలో గెలవాలని, ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే తన తపన, లక్ష్యం. తను అనారోగ్యంతో ఉన్నా పిల్లల భవిష్యత్తే తనకు ముఖ్యం. ఎన్ని ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు చుట్టుముట్టినా..ఏమాత్రం అదరదు. బెదరదు. ఓర్పు, సహనంతో ఉంటూ పిల్లల జీవితంలో ఎదురయ్యే సవాళ్లలో తోడుగా ఉంటుంది. లైఫ్‌లో ఎంత ఎత్తుకు ఎదిగినా తన ముందు మనం పిల్లలమే. చిన్నవాళ్లమే. తన ప్రేమానురాగాలు వెలకట్టలేనివి. ప్రపంచవ్యాప్తంగా ఏటా మే నెల రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రేపు ( May 12) మాతృదినోత్సవం సందర్భంగా అమ్మ ప్రత్యేకత, గొప్పదనం గురించి కొన్ని విషయాలు..

బాల్యంలో..

ఏడిస్తే ఓదారుస్తుంది. అలిగితే బుజ్జగిస్తుంది. కోప్పడితే భరిస్తుంది. మారాం చేస్తే సహిస్తుంది. అడిగితే కాదనదు. చెప్పిన పని చేయకున్నా తనకి ఆనందమే. పిల్లల అల్లరి వేశాలతోనే తన అలసట తీరుతుంది. పెళ్లయ్యాక పిల్లలే తన సర్వస్వంగా పెంచుతుంది. కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తన సామర్థ్యానికి మించి కష్టపడే ప్రయత్నం చేస్తుంది. బిడ్డలకు లోటు రాకుండా ఉండాలని తపిస్తుంది. అనుక్షణం తన తపన, టార్గెట్ పిల్లల రక్షణే. అమ్మను ఇష్టపడని వారెవరుంటారు? చిన్నప్పటి నుంచి మనకు కావాల్సింది మొదటగా గెస్ చేసేది అమ్మ. దెబ్బ తగిలితే తల్లడిల్లి విలవిల్లాడిపోతుంది. బాధలో నెమ్మదినిస్తుంది. పరిమితులు లేని ప్రేమను పంచుతుంది.

యవ్వనంలో..

కొత్తగా నిజమైన ప్రపంచంలోకి అడుగుపెట్టిన తరువాత ఉండే ఇబ్బందులు అనేకం. లవ్, అక్రమ సంబంధాలు, కుట్రలు, కుతంత్రాలు, హింస, ద్వేశం ఇలా ఎన్నో విషయాలపై అవగాహన కల్సిస్తుంది. జాగ్రత్తపరుస్తుంది. కుంగిపోకుండా ఎంకరేజ్‌మెంట్ ఇస్తుంది. విజయాలకు బాటలు వేసే మార్గాన్ని సూచిస్తుంది. మెయిన్‌గా అమ్మాయిలు, అబ్బాయిల వ్యక్తిత్వం, ప్రవర్తన గురించి విశ్లేషణ ఇస్తుంది. మనల్ని మనం కాపాడుకునేలా సెల్ఫ్ డిఫెన్స్‌ పైనా అవగాహన కల్పిస్తుంది. రక్షణగా తన సహకారాన్ని అందిస్తూ ఎప్పటికప్పుడు మనల్ని ఉన్నత స్థానంలోనే ఉంచుతుంది.

పెళ్లయ్యాక..

పెళ్లి అయినా అమ్మతో బంధం అనేది వేరు చేయలేనిది. ఎప్పటికీ తెగిపోనిది. కొత్తగా సంసారంలో కావాల్సినవన్నీ తాను సమకూరుస్తుంది. భార్య/ భర్త, అత్తమామలు, మెట్టినింటి వారితో ఎదురయ్యే సమస్యల్ని దీటుగా ఎదుర్కొంటుంది. తన బిడ్డకు అండగా నిలబడుతుంది. అవసరమైతే ఎంతదూరమైనా వెళ్తుంది. తన పిల్లల గురించి కొట్లాడుతుంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు అండగా నిలుస్తుంది. సలహాలు, సూచనలు ఇస్తూ తన వంతు ప్రయత్నం చేస్తుంది. జీవితంలో గెలుస్తామన్న నమ్మకం కల్పిస్తుంది.

వృద్ధాప్యంలో ప్రేమ..

ఏ సమస్య వచ్చినా అమ్మ పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుంది.. ప్రశాంతంగా ఆలోచించి సమస్య నుంచి బయటపడే మార్గాన్ని, సలహాలను అందిస్తుంది. అమ్మ ఒడిలో ఉన్న ప్రశాంతత ఈ భూమ్మీద మరెక్కడా దొరకదు. మనకి ఎనలేని సేవలు చేసిన అమ్మకు మనం ఏం ఇచ్చినా రుణం తీర్చుకోలేం. వృద్ధాప్యంలో కసురుకోకుండా కాస్తంత ప్రేమ చూపిస్తే తను హ్యాపీగా ఉంటుంది. అంతకు మించి మనం తీర్చుకునే రుణం అంటూ ఏదీ లేదు. తరతరాలుగా భారతీయ సంస్కృతిలో భాగంగా ఇది కొనసాగుతోంది. కొత్తగా మీరు చేయాల్సిందేం లేదు. బతికున్నప్పుడే తనను హ్యాపీగా ఉంచాలి. అంతకన్నా ఇచ్చే బహుమతి ఇంకేముంటుంది. ఈ సంత్సరం మదర్స్‌ డే రోజు అమ్మకు స్పెషల్ విషెస్ చెప్పి కాసేపు ఫ్రీగా మాట్లాడండి. మంచి ఫ్రెండ్ తను.

Recent

- Advertisment -spot_img