Homeహైదరాబాద్latest NewsTrump : అసలు తగ్గేదేలే.. ట్రంప్ కు భారీ షాకిచ్చిన చైనా

Trump : అసలు తగ్గేదేలే.. ట్రంప్ కు భారీ షాకిచ్చిన చైనా

Trump : చైనాపై అమెరికా టారిఫ్‌లను ప్రకటించిన తర్వాత చైనా మరోసారి సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. చైనా నుంచి వచ్చే వస్తువులపై ట్రంప్ ప్రభుత్వం 104 శాతం సుంకం విధించగా, అమెరికా ఉత్పత్తులపై చైనా 84 శాతం టారిఫ్ విధించనుంది. ఈ టారిఫ్‌లు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది. అదేవిధంగా, చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ 12 అమెరికన్ సంస్థలను దాని ఎగుమతి నియంత్రణ జాబితాలో చేర్చింది. ఏప్రిల్ 10 నుండి అమెరికన్ వస్తువులపై ఈ అదనపు సుంకాలు విధించబడతాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 60 దేశాలపై విధించిన కొత్త సుంకాలు బుధవారం అమెరికా సమయం అర్ధరాత్రి తర్వాత అమల్లోకి వచ్చాయి. చైనా అమెరికన్ వస్తువులపై సుంకాలను ప్రకటించడంతో యుఎస్ స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్స్ కూడా బాగా పడిపోయాయి.

Recent

- Advertisment -spot_img