Trump Biden Debate 2020 : An interesting meeting on the US presidential election took place in Cleveland, USA. Candidates from both parties clashed on the same stage as in every election. The two then explained their arguments to the public.
అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌లో అమెరికా అధ్యక్ష్య ఎన్నికకు సంబందించిన ఆసక్తికర సమావేశం జరిగింది. ప్రతీ ఎన్నికల్లో జరిగినట్లే ఇరు పార్టీల అభ్యర్థులు ఒకే స్టేజిపై తమ మాటలతో తలపడ్డారు. ఇక ఇరువురూ తమ వాదనలను ప్రజలకు వివరించారు. కరోనా విజృంభణ మొదలుకుని దేశంలోని కీలక సమస్యలపై తమకున్న చిత్తశుద్దిని ప్రజలకు వివరించారు ఇరు పార్టీల నాయకులు. అలాగే భారత్ పట్ల ఇద్దరు నాయకులు కాస్త నోరు జారారు.
అమెరికా కంటే గ్లోబల్ వార్మింగ్‌కు చైనా, రష్యా, భారత్ దేశాలే కారణమని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అలాగే కరోనా లెక్కలు భారత్ సరిగ్గా చెప్పలేదన్నారు. ఇవే వ్యాఖ్యలను బిడెన్ కూడా చెప్పారు.
ఇక బరాక్ ఒబామా పదవీకాలంలో కూడా సన్నిహిత మిత్రుడిగా భావించిన భారతదేశంపై జో బిడెన్ వ్యతిరేఖ వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ కామెంట్స్
- మాజీ అధ్యక్ష్యుడు ఏర్పాటు చేసిన ఒబామాకేర్ నిర్వహణ చాలా కష్టంగా ఉంది, పెద్ద కర్చుతో కూడుకున్న వ్యవహారం.
- ఆరోగ్య భామా రద్దు చేయము, ఇంకా తక్కువ ధరలో అందిస్తాము.
- చైనా వల్ల వచ్చిన కరోనాతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు అవస్థలు.
- మా పనితీరు వల్లనే దేశంలో తక్కువ మరణాలు సంబవించాయి, లేకుంటే ఇంకా పెద్ద ఎత్తున మరణాలు ఉండేవి.
- దేశంలో 7 లక్షల ఉద్యోగాలు తిరిగి తీసుకువచ్చాను.
- పర్యావరణ పరిరక్షణకు మేము కట్టుబడి ఉన్నాం. కానీ దాని పేరిట వ్యాపారాలను దెబ్బతీయలేము. ప్యారిస్ ఒప్పందం మంచిది కాదు.
బైడెన్ కామెంట్స్
- కరోనా నియంత్రణ, ప్రజారోగ్యం పట్ల ట్రంప్‌కు శ్రద్ద లేదు. అతని విదానాలతో వేలాది ప్రాణాలు పోయాయి.
- ఒబామా కేర్ రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలు అవుతారు.
- ప్రజల ప్రాణాలకంటే ట్రంప్‌కు డబ్బులే ముఖ్యమా..
- సమయానికి సరైన కట్టడి చేయకపోవడం వల్లనే దేశంలో వేలాది ప్రాణాలు పోయాయి.
- మేం అధికారంలోకి వస్తే ట్రంప్ కంటే 7 మిలియన్ల ఎక్కువ ఉద్యోగాలు సృష్టిస్తాం.
- ట్రంప్ అమెరికా చరిత్రలోనే తక్కువ ఉద్యోగాలు తెచ్చిన అధ్యక్ష్యుడు.
- ట్రంప్ పాలనలో దేశంలో వివక్ష పెరిగింది.
- పర్యావరణంపై ట్రంప్‌కు అవగాహన లేదు. పునరుత్పాదక ఇందనాలపై మేము శ్రద్ద పెడతాము.