Homeఅంతర్జాతీయంఅమెరికాలో చావులకు కారణం ట్రంపే : బిడెన్​

అమెరికాలో చావులకు కారణం ట్రంపే : బిడెన్​

వాషింగ్టన్ : కోవిడ్​19 మహమ్మారి సమయంలో అమెరికా అధ్యక్షుడునిగా డొనాల్డ్ ట్రంప్ పేలవమైన ఆర్థిక విధానాల కారణంగా ప్రజల జీవితం విషయంగా మారిందని డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ అన్నారు.

“అతను (ట్రంప్) ఏమి చెప్పినా, ఏమి చెసినా, డోనాల్డ్ ట్రంప్ అధికారం వల్ల అమెరికాలో మీరు సురక్షితంగా లేరు, రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికన్లు పోరాడుతున్నప్పుడు చివరిసారిగా ప్రజలు చనిపోయారు, తిరిగి ఈ మహమ్మారి సమయంలో డోనాల్డ్ ట్రంప్ చేసిన చెత్త పరిపాలన వల్ల అమెరికన్లు మరణిస్తున్నారు ” అని విల్మింగ్టన్ ఆర్థిక వ్యవస్థపై బిడెన్ తన వ్యాఖ్యలలో అన్నారు.

బ్లాక్, లాటినో, ఆసియన్ అమెరికన్, స్థానిక అమెరికన్ కార్మికవర్గ వర్గాలపై అసమాన ప్రభావం ఉన్నప్పటికీ – శ్వేతజాతీయుల శ్రామిక వర్గాల సంఘాలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి అన్నారు.

ఇక కరోనా ప్రపంచమంతా విస్తరిస్తున్న సమయంలో ఆర్థిక విదానం పేరుతో కరోనా కట్టడికి చర్యలు చేపట్టకపోవడం వల్లే, ట్రంప్ వల్లనే కరోనా దేశంలో విస్తరించిందన్నారు.  ప్రతిరోజు కరోనాతో వెయ్యి  మంది చనిపోతున్నారని,  మొత్తంగా ఇప్పటివరకు 2 లక్షల  మరణాలకు అమెరికా  చేరుకుంటుందని, ఇందుకు కారణం  ట్రంప్ చేతకాని  పాలనే అన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img