Homeహైదరాబాద్latest NewsTrump : ఆ దేశాలకు షాక్ ఇచ్చిన ట్రంప్.. భారీగా సుంకాలు విధింపు..!!

Trump : ఆ దేశాలకు షాక్ ఇచ్చిన ట్రంప్.. భారీగా సుంకాలు విధింపు..!!

Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) సంచలన నిర్ణయం తీస్కున్నారు. ఈ మేరకు మూడు దేశాలపై భారీగా సుంకాలు విధించారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా యొక్క మూడు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములైన చైనా, మెక్సికో మరియు కెనడా నుండి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై కొత్త సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త సుంకాలను మంగళవారం నుండి కెనడా మరియు మెక్సికోపై 25% మరియు చైనాపై 10% సుంకాలను అమెరికా విధిస్తుందని ట్రంప్ తెలిపారు. కెనడియన్ ఇంధనం 10% తక్కువ సుంకాన్ని వింధించారు. అక్రమ వలసలు మరియు మాదకద్రవ్యాల అక్రమ రవాణా గురించి తన ఆందోళనలను మూడు దేశాలు పరిష్కరించకపోతే దిగుమతి పన్నులు విధిస్తామని ఆయన ప్రకటించారు. టారిఫ్‌లపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా కెనడా, మెక్సికో దేశాల్లో ఆర్థిక మాంద్యం సంభవించే ప్రమాదం ఏర్పడింది.

Recent

- Advertisment -spot_img