Homeహైదరాబాద్latest NewsTrump : ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్

Trump : ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్

Trump : ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ రాజధానిలోని అణు విద్యుత్ ప్లాంట్లు, సైనిక కార్యాలయాలు, సైనిక పరికరాల తయారీ కేంద్రాలపై భారీ దాడులకు దిగింది. ఈ సంక్షోభ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను అణ్వాయుధ వ్యతిరేక ఒప్పందంపై సంతకం చేయాలని హెచ్చరించారు. శుక్రవారం మరోసారి ఈ పిలుపును పునరుద్ఘాటిస్తూ.. ఒప్పందం కుదరకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్‌కు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.

ట్రంప్‌ తన సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌ సోషల్‌ ద్వారా స్పందిస్తూ.. ఇరాన్‌కు ఒప్పందం కుదుర్చుకునేందుకు ఒక అవకాశం తర్వాత మరో అవకాశం ఇచ్చాను. యూఎస్‌తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఎన్నిసార్లు సూచించినా, టెహ్రాన్‌ అంగీకరించలేదు అని పేర్కొన్నారు. అమెరికా ప్రపంచంలోనే అత్యుత్తమ, అత్యంత ప్రాణాంతక సైనిక పరికరాలను తయారు చేస్తోందని, వాటిలో అనేకం ఇజ్రాయెల్‌ వద్ద ఉన్నాయని, వాటిని ఎలా ఉపయోగించాలో ఇజ్రాయెల్‌కు బాగా తెలుసని ఆయన అన్నారు. ఇరాన్‌ అణు ఒప్పందాన్ని అంగీకరించకపోతే, పరిస్థితి ఊహించిన దానికంటే దారుణంగా ఉంటుంది అని ట్రంప్‌ హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img