ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఒకే ఒక్క యాత్రతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రమేమా రిపోయింది. యావత్ రైతాంగం కట్టున కదిలింది. పల్లెపల్లెనా సానుభూతి పెల్లుబికింది. కదనరం గంలో సన్నివేశం మారిపోయింది. ఐరిలో లేద నుకున్న పార్టీ గిరిగీసి సమరశంఖం పూరించేం దుకు సిద్ధమైంది. రాజకీయ విశ్లేషకుల లెక్కలు తారుమారై.. ప్రత్యర్థులకు వెన్నులో వణుకుపు ట్టింది. ఆ యాత్రే కేసీఆర్ చేసిన బస్సు యాత్ర.. బీ ఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. ఆ పార్టీకి ఇక నూకలు చెల్లినట్టేనని అంతా గేలిచేశారు. గులాబీ పార్టీ ఖాళీ అంటూ కొన్ని పత్రికల్లో పుంఖానుపుం ఖాలుగా పతాక శీర్షికన కథనాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ వచ్చి చేరినట్టు పరిస్థితి కనిపించింది. ఇక బీజేపీ సైతం దూకుడు ప్రదర్శించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు పెరిగిపోయా యి. కేడర్ లో నైరాశ్యం ఆవరించింది. అసలు భవిష్యత్ లో తెలంగాణలో బీఆర్ఎస్ ఉంటదా? అన్న స్థాయికి చర్చ వెళ్లింది.. కానీ ఒక్క యాత్ర ఈ ఊహాగానాలను పటాపంచలు చేసింది. బీఆర్ఎస్ తెలంగాణ గడ్డ మీద నిటారుగా నిలబడి సవాల్ చేసేలా చేసింది.
పడిపోయిన చోటి నుండే తిరిగిలేస్తోంది..
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి దూరమైంది. గ్రామీణ వర్గాలే. నగర ఓటర్లు ఆ పార్టీకి అండగా నిలబడ్డారు కానీ పల్లె ఓటరు దూరమయ్యా డు. ముఖ్యంగా రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు కాంగ్రెస్ కు ఓటేశారు. వెరసి గ్రామీణ తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్ధకమైంది. అందుకే కేసీఆర్ తనకు దూరమైన వర్గాలను దగ్గర చేసుకొనే ప్లాన్ వేశారు. తాను గతంలో ఎంతో మేలు చేసిన ఆ వర్గాన్నిమళ్లీ తన వైపుకు తిప్పుకొనేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయ త్నం సక్సెస్ అయ్యింది. బస్సు యాత్రలో కేసీఆర్ సంధించిన సూటి ప్రశ్నలు .. నేరుగా రైతన్న మనసును తాకాయి. ‘బీఆర్ఎస్ పాలన ఎట్లుండే.. కాంగ్రెస్ పాలన ఎట్లుంది? ఆ నాడు రైతు బంధు ఎట్ల వచ్చేది? ఇప్పుడు ఎట్ల వస్తున్నది? అప్పుడు కరెంటు ఎట్లుండేది? ఇప్పుడు ఎలా ఉంటున్నది.. అప్పుడు చెరువులు, వాగులు, వంకలు ఎలా కళకళలాడేవి? ఇప్పుడు వాటి పరిస్థితి ఏంది?” ఇటువంటి ప్రశ్నలను కేసీఆర్ యాత్ర పొడవునా సంధించారు. పోల్చి చూసుకున్న గ్రామీణులు కేసీఆర్ తో కనెక్ట్ అయ్యారు. ఆయన చెప్పినదాం ధోనిజముందని భావించారు. అందుకే ఉప్పెనలా తరలివచ్చారు. వెరసి బస్సు యాత్రను విజయవం తం చేశారు.
రైతుబంధు .. గందరగోళం
రైతుబంధు పథకంతో తెలంగాణ రైతులకు ఉన్న బంధం మాటల్లో చెప్పలేనిది. పెట్టుబడి సాయంతో లక్షల మంది రైతుల జీవితాలు మా రిపోయాయి. అటువంటి రైతు బంధు పథకం మీద కాంగ్రెస్ హయాంలో నీలినీడలు కమ్ముకు న్నాయి. . తాము పవర్ లోకి వస్తే పదివేలు కాదు. పదిహేనువేలు రైతు బంధు ఇస్తామన్న రేవంత్.. ఆ తర్వాత మాట మార్చారు. అసలు రైతు బంధు పథకం మొత్తం నిర్వీర్యం చేసే కుట్ర చేశారు. సరిగ్గా ఇక్కడే కేసీఆర్ తన చాణక్యం ప్రదర్శించా రు. ఈ ఒక్క రైతు బంధు అంశం మీద ఆయన సంధించిన ప్రశ్నలు అన్నదాతలను ఆలోచనల్లో పడేశాయి. ఐదెకరాలు ఉన్నోడికి రైతు బంధు ఇస్తున్నారు.. మరి ఆరెకరాలు ఉన్నోడు ఏం పాపం చేసిండు.. ఏడెకరాలు, ఎనిమిదెకరాలు, తొమ్మిది, పది ఎకరాలు ఉన్నోడు రైతు కాదా? అన్న కేసీఆర్ ప్రశ్న.. రైతు లోకాన్ని కదిలించింది. అందుకే సారును చూసేందుకు రైతుబిడ్డలు బారులు తీరిండ్రు… కాంగ్రెస్ దిగివచ్చి రైతు బంధు ఇయ్యాల్సి వచ్చింది. సర్కారు రైతు భరోసా అని చెప్తున్నా.. వాళ్లు ఇస్తున్న మొత్తం పాత సర్కారు ఇచ్చే పదివేలే అని తెలుసుకోలేనంత అమాయకు లు కాదు రైతులు.
కేదర్ ఊహించలే..
పత్రికల్లో వస్తున్న వార్తలు, జరుగుతున్న పరి ణామాలు చూస్తుంటే బీఆర్ఎస్ పని అయిపోయి నట్టేనా? అన్న చర్చ సామాన్యులతో పాటూ ఆ పార్టీ కేడర్ లోనూ కనిపించింది. కేటీఆర్, హరీశ్ రావు కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరుగు తున్నా పార్టీలో జోష్ రాలేదు. దీంతో కార్యకర్తల్లో నైరాశ్యం ఆవహించింది. అప్పుడే కేసీఆర్ బీఆ ర్ఎస్ పార్టీకి ఆ శాదీపమై కదిలిండు. తాను చేసిన మంచిని చెప్పుకున్నాడు. ప్రత్యర్థి చేతగానితనాన్ని వివరించాడు. జనంలో ఆలోచనల మొదలైంది. బీ ఆర్ఎస్ పార్టీలో జోష్ వచ్చింది. అసలు బీఆర్ఎస్ పార్టీ ఇంత త్వరగా పుంజుకుంటున్నదని ఆ పార్టీ కేడర్ కూడా ఊహించలేకపోయింది.
ఓటు ఎవరికి?
ప్రస్తుతం యావత్ తెలంగాణ వ్యాప్తంగా రైతాంగంలో వ్యతిరేకత కనిపిస్తున్నమాట నిజమే. బీఆర్ఎస్ పాలనలో పల్లెలు ఎట్లుండేవి? ఇప్పుడు ఎట్లున్నయని రైతన్నలు పోల్చి చూసుకుంటున్నా రు. ఎండిన చెరువులు, వాగులు, వంకలు చూసి దు:ఖాన్ని దిగమింగుతున్నారు. కచ్చితంగా వారికి కాంగ్రెస్ పాలన మీద అసంతృప్తి ఉంది. మరి ఈ అసంతృప్తి ఓటు రూపంగా మారితే నష్టం ఎవరికి? కాంగ్రెస్ ప్రభుత్వం మీదున్న వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ వైపే మళ్లుతుందా? లేక బీజేపీ వైపు మళ్లుతుందా? అన్నది వేచి చూడాలి.