Homeహైదరాబాద్latest NewsTS Elections: గ్రామాల్లో కొప్పుల ఈశ్వర్ కూతురు నందిని ప్రచారం

TS Elections: గ్రామాల్లో కొప్పుల ఈశ్వర్ కూతురు నందిని ప్రచారం

ఇదే నిజం, గొల్లపల్లి: బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కి మద్దతుగా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్, దమ్మన్నపేట్, ఆత్మకూరు గ్రామలలో ఈశ్వర్ అన్న కూతురు నందిని మరియు గొల్లపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ నాయకులు ఉపాధి హామీ కూలీలను కలిసి ప్రచారం చేశారు. నందిని మాట్లాడుతూ మా నాన్న ఎమ్మెల్యేగా చేసిన సేవలను, ప్రతి గ్రామంలో చేసిన అభివృద్ధినీ చూడండి, అలాగే నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుడు, ఆపదలో ఉన్నవారు అన్న అంటే నేనున్నానని ధైర్యం చెప్పే నాయకుడు కొప్పుల ఈశ్వర్, అలాంటి నాయకుడు మన ఈశ్వరన్న పెద్దపల్లి ఎంపీ గా పోటీచేస్తున్నారు. మీరు అందరూ ఆశీర్వాదించి ఈశ్వరన్న కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో జడ్పిటిసి గోస్కుల జలంధర్, ఎంపీపీ నక్క శంకరయ్య, వైస్ ఎంపీపీ ఆవుల సత్యం, పార్టీ మండల అధ్యక్షులు బొల్లెం రమేష్, మండల యూత్ అధ్యకులు చెవుల రవీందర్, మండల కోఆర్డినేటర్ బోయపోతు గంగాధర్, ఎంపిటిసి గోవిందుల జలపతి, మాజీ సర్పంచ్లు నేరేళ్ల గంగారెడ్డి, గుడ్ల రాజేశం, ఎరవేణి రమేష్, లక్ష్మీపురం మాజీ సర్పంచ్, టిఆర్ఎస్వి మండల అధ్యక్షులు ఆవారి చందు, మాటేటి తిరుపతి, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img