తెలంగాణ PGECET వెబ్ ఆప్షన్ల నమోదు ఈ నెల 2 నుంచి 4వ తేదీకి వాయిదా పడింది. భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాల్లో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, ఇంటర్నెట్ సెంటర్లు మూతపడ్డాయని అభ్యర్థులు ఉన్నత విద్యామండలి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెబ్ ఆప్షన్ల నమోదుకు ఈ నెల 4, 5 తేదీల్లో అవకాశం కల్పించనుంది. 6న ఎడిట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. 9న ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది.