HomeతెలంగాణTS Police : వనమా రాఘవ కేసు.. ప్రభుత్వానికి పోలీసుల స్పెషల్ రిక్వెస్ట్

TS Police : వనమా రాఘవ కేసు.. ప్రభుత్వానికి పోలీసుల స్పెషల్ రిక్వెస్ట్

TS Police : వనమా రాఘవ కేసు.. ప్రభుత్వానికి పోలీసుల స్పెషల్ రిక్వెస్ట్

TS Police : పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు కోర్టులోనూ బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.

వనమా రాఘవ కేసుల విషయమై ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖ రాశారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాల్వంచ మండిగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేందర్ రావు అలియాస్ రాఘవకి ఉచ్చు బిగుసుకుంటోంది.

Insurance : 2 కోట్ల కుటుంబాలకు ఉచితంగా రూ.5 లక్షల బీమా

ABP C Voter Survey : యూపీలో చరిత్ర సృష్టించనున్న బీజేపీ..

ఇప్పటికే బెయిల్ రాకుండా పకడ్బందీగా రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేసిన పోలీసులు కోర్టులోనూ బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు.

అందులో భాగంగా ప్రభుత్వానికి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు.

వనమా రాఘవ కేసులు వాదించేందుకు తమకు ప్రత్యేక న్యాయవాది(పబ్లిక్ ప్రాసిక్యూటర్) కావాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం.

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య అనంతరం రాఘవ అరెస్టులో జాప్యం జరగడంతో పోలీసులపై విమర్శలొచ్చాయి.

అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు కావడంతో పోలీసులు కూడా సహకరిస్తున్నారంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.

Lockdown : లాక్​డౌన్​పై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి కీలక వ్యాఖ్యలు

Robots : ఈ రోబో మనిషి మెద‌డునే చ‌దివేస్తుంది

అయితే ప్రత్యేక టీమ్‌లతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు వనమా రాఘవని ఏపీ తెలంగాణ సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు.

ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడంతో న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు.

గతంలో ఫైనాన్స్ వ్యాపారి మలిపెద్ది వెంకటేశ్వర్లు ఆత్మహత్య కేసులో వనమా రాఘవ ముందస్తు బెయిల్ తీసుకోవడంతో ఈ సారి అవకాశం కూడా ఉండకుండా చేసేందుకు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌ని సిద్ధం చేశారు.

ఏడు పేజీల రిమాండ్ రిపోర్ట్‌లో రాఘవపై ఉన్న 12 కేసులను ప్రస్తావించారు.

అనంతరం వనమా రాఘవను భద్రాచలం సబ్ జైలుకి తరలించారు.

అయితే జైల్లో భద్రతా కారణాల రీత్యా రాఘవను ఖమ్మం జైలుకి తరలించాలని జైలు అధికారులు విన్నవించడంతో న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు.

దీంతో వనమా రాఘవను ఖమ్మం జైలుకు తరలించారు.

Insurance : 2 కోట్ల కుటుంబాలకు ఉచితంగా రూ.5 లక్షల బీమా

Electronics Price : ఈ ఎండాకాలం ఫ్రిజ్‌లు-ఏసీల ధరల మంట‌లు

Recent

- Advertisment -spot_img