TS Polycet Results : తెలంగాణ రాష్ట్రంలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS POLYCET-2025) ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరిగింది. పాలిసెట్ ఫలితాలు రేపు మే 24న ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలిపారు.
ఈ పరీక్షను మే 13న రాష్ట్రవ్యాప్తంగా 276 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం 1,06,716 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, వీరిలో 98,858 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల విడుదలైన తర్వాత టీజీ పాలిసెట్ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేస్కోవచ్చు.
ముందుగా SBTET అధికారిక వెబ్‌సైట్ (polycet.sbtet.telangana.gov.in) సందర్శించండి. “POLYCET 2025 Results” లింక్‌పై క్లిక్ చేయండి. హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేసి, ర్యాంక్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ తరువాత ర్యాంక్ కార్డ్‌ను ప్రింట్ చేసుకోండి.